Tuesday, March 29, 2011

బీడీ అప్ప ....బీడీ అప్ప ...

                         నేను వంట పనిలో నిమగ్నమయి ఉన్నాను ....అప్పటిదాకా గోలగోలగా ఉన్న ఇల్లు ఒక్కసారే కర్ఫు విధించినట్టు ఉంది .అంతకు ముందు రోజే హైదరాబాద్ నుంచి పెద్దక్క ,డెల్లి నుంచి తమ్ముడు వచ్చేరు .వాళ్ళు వచ్చేరని
చిన్నక్క ,చెల్లి కూడా వచ్చేరు అందరు కబుర్లు చెప్పుకుంట ఉన్నారు .కిచెన్
 గదిలో ఉన్న నేను , 'అందరు అమ్మ వాళ్ళింటికి వెళ్ళేర ఏంటి' అనుకుంటూ  హాల్లోకి వచ్చెను . అందరు అక్కడే ఉన్నారు ,కానీ చిన్నక్క పడుకుని ఉంది ట్రాన్స్లో ఉన్నట్టు అన్ని విషయాలు చెపుతుంది . ఏంటి విషయం అని  మా చెల్లిని మెల్లిగా అడిగెను .మాచెల్లి కిసకిస నవ్వుకుంటూ గత జన్మ  రహస్యమంట అని గుస గుసగ చెప్పింది .నాకు ఇలాంటివాటి మీద  అంతనమ్మకం ఉండదు ,అందుకే  నాకు నవ్వు  వచ్చి
నవ్వాను , నాతోపాటు మా చెల్లి నవ్వడం మొదలు పెట్టింది .అంతేమా ఇద్దరినీ అక్క సీరియస్ చుసింది 'మీకు నమ్మాకంలేకపోతే వెళ్ళిపొండి మమ్మలిని డిస్టర్బ్ చెయ్యొద్దని'అనే అర్థంతో ,...పెద్దక్క ఆంటే అందరికి  కొంచం గౌరవం తో కూడిన భయం .  అంతే ఇద్దరం బుద్ధిగా కూర్చుని చిన్నక్క గత జన్మ రహస్యం చెపుతుంటే విన్నాము .                                                                చిన్న తమ్ముడు మా దగ్గరకు రాకముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్ పెద్దక్క దగ్గరకు వచ్చాడు ,అప్పుడు పెద్దక్క తమ్ముడుతో'పునర్జన్మల గురించి రిసెర్చ్ చేసిన ఇద్దరు డాక్టర్స్ఉన్నారంట,వాళ్ళుఎవరి  పునర్జన్మ    ఏంటో చెపుతారంట ' మనము వెళ్దామా అందంట.ఇలాంటి సబ్జెక్టు ఆంటే వాడికి మహా ఇష్టం ,దాదాపు ఇద్దరి అభి రుచులు ఒక్కటే .ఇద్దరు కలిసి వెళ్లి వాళ్ళ గత జన్మ గురించి తెలుసు కున్నారు . ఇంతకి తమ్ముడేమో గత జన్మలో కింగ్ అంట ,అక్క బంజారా స్త్రీ అంట . అలాగే  మా అందరి గత జన్మలు తెలుసుకోవాలని వారి ప్రయత్నం .                                                                                                               మా టీవీ లో ప్రతి బుధవారం వచ్చే గత జన్మ రహస్యాలు అనే రియాల్టీ షోని చూస్తున్నాను .ఇంతకి అక్క వాళ్ళు వెళ్ళింది అయన దగ్గరకే నంట.ఆ షో చూస్తుంటే అచ్చర్యంగా,ఆసక్తిగా  అన్పిస్తుంది  .ఒక్కొకసారి  నమ్మలా,వద్ద అన్పిస్తుంది.ఎప్పుడో 13th century లోజన్మ తరువాత మళ్లి ఇప్పుడు పుట్టివుంటే ఈ మధ్యలో చాల జన్మలు ఎత్తి ఉండాలి ,అంటే ఎప్పుడు మనుషులుగానే పుడతామ?ఏ దేశం లో వాళ్ళు ఆ దేశంలోనే పుడతార ? ఆత్మలు మరి దేవుడి దగ్గరకువెళ్ళవ ?మరి దయ్యాల విషయమేంటి ?పునర్జన్ముంటే దయ్యాలు లేనట్టేకద ?ఇలాంటి సందేహాలెన్నో. .                                                                                                                                                                       మా మామయ్య  చెప్పిన సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది .                                                                          మా చిన్నప్పుడు   గుంతకల్లు లో మా పెదనాన్న గారు కాంట్రాక్టర్ లు  చేసేవారు ,ఆయనకు హెల్పగ మా మామయ్యా  వెళ్ళేరు .ఉరవకొండ అనే ఊరులోవర్క్స్ జరిగేవంట అక్కడంతా అడివి ప్రాంతం , ఒక్కొక్క సారి వర్క్ ముగించుకుని వచ్చే సరికి లేట్ అయ్యేదంట. అందరు ఎప్పుడు ఒక్కసారే ఇంటికి వెళ్ళేవారంట .ఒకసారి వర్కర్స్ అందరు వెళ్లి పోయారంట .పని ఉండి మామయ్యా ఆలస్యంగా బయలుదేరేడంటదంత  . అప్పటికి తొమ్మిది గంటలయ్యింది ,చిమ్మ చీకటి ,దారి మధ్యలో వెహికల్ ఆగి పోయిందట ,మబ్బులు కూడా పట్టి వర్షం వచ్చేలాఉందంట( ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు) ఆ దారిలో వెళ్ళేవాళ్ళు కన్పిస్తరేమో అని చూస్తూన్నడంట  .అనుకున్నట్టుగానే ఒకాయన నడుచుకుంటూ వస్తు న్నడంట,మా మామయ్యా కి ప్రాణం లేచి వచ్చిందంట . దగ్గరకు వచ్చిన తరువాత మామయ్యా  ప్రోబ్లం చెప్పి ,ఎక్కడనుంచి వస్తున్నారని మాట కలిపాడంట .అతను ఏమి మాట్లాడకుండా చలిగా ఉంది బీడీ అప్ప అని అడిగాడంట .బీడి లేదన్నడంట ,అయిన మళ్లి బీడీ అప్ప ....బీడీ అప్ప అంటున్నడంట .వీడేదో తేడాగా ఉన్నాడు అని మామయ్యా   స్పీడ్గా నడవటం మొదలెట్టేడంట ,ఆయనకూడా మామయ్యా పక్కనే నడుస్తా  బీడీ అప్ప..బీడీఅప్ప   ..అని అడుగుతూనే ఉన్నడంట .మామయ్యా కి విసుగొచ్చి జేబులోనుంచి సిగరెట్ పెట్టి తీసి అతనికి ఒకటిచ్చి తను  కూడా అగ్గి  పెట్టి వెలిగించాడంట   .పక్కనున్న వ్యక్తి అదృశ్య మయ్యడంట .ఒక్కసారే వళ్ళుజలదరించి స్పీడ్ గా నడుస్తున్నడంట , సిగరెట్ అయిపొయింది .కాసేపటికి మళ్లి బీడీ అప్ప ...బీడీ అప్ప అనివెనకాలే మళ్ళి వచ్చేడంట . వెంటనే ఇంకో సిగరెట్ వెలిగించేడంట ,మళ్లి మాయం .నిప్పు ఉంటె ఆ దెయ్యం ఉండట్లేదని అర్ఘమయ్యి ,ఆ రిపోయినప్పుడల్లా అగ్గిపుల్ల వెలిగించుకుంట ,బ్రతుకు జీవుడా అనుకుంట ఇంటికి చేరేడంట.                                                                                                                                                            ఊరు   నుంచి వచ్చిన మామయ్య జరిగిన సంఘటన అమ్మ కి చెపుతుంటే ,చిన్న పిల్లలమయిన మేమందరమూ విని ,భయం తో  మా అందరికి నెల రోజులు సరిగ్గా నిద్రలు లేవు .                                                                                                                                                              ఇప్పుడు నేను  దేయ్యలన్న   ,పునర్జన్మలన్న  నమ్మను .మనము పుట్టకముందు మనకు ఏమితెలియదు  ,అలాగే తరువాత కూడా ప్రకృతిలోనో ,దేవుడి లోనో ఆత్మ  కలిసిపోతుంది  అనుకుంటాను .అల అయితేనే బాగుంటుంది .                                                                     







                                                                                                                                                                                           

             

No comments: