Sunday, March 13, 2011

మానవత్వమ నీ చిరునామా ఎక్కడ?


                        " నీకో బాధకరమయిన విషయం చెప్పనా"అంది పెద్దక్క ఫోన్లోలో .చెప్పు అన్నాను కాస్త భ యపడుతూ."ఏమిలేదు మన ఈశ్వర్ రావు మామయ్య ఓల్డ్ ఎజ్ హోం లో ఉన్నరు ,బర్త్ డేకి ఆర్ఫన్ హోం లో స్వీట్స్ పంచడానికి వెళ్ళితే అక్కడ చూసేను ,చాల బాధవేసింది,  వాళ్ళ పిల్లలమీద చాల కోపంగా ఉంది , ఆయనకీ ఎలా హెల్ప్ చెయ్యల అని ఆలోచిస్తున్నాను అంది " .అది వినగానే  నాకు చాల బాధ వేసింది .ఆరోజంతా మనసు వికలంగ ఉంది ఆయన గుర్తుకు  వస్తూనే ఉన్నారు .                                                                                                                                                      
                                  ఈశ్వర్ రావు అంకుల్ మాకు బందువు ,అంతకంటే ఎక్కువ నాన్న గారి కి స్నేహితులు ,సెంట్రల్ గవర్నమెంట్ లో చాల పెద్ద పోస్ట్ లో ఉండేవారు ,సంపన్న కుటుంబం .ఇల్లు జమిందారుల ఇల్లులాగా,ఇస్వర్యంతో కళకళలాడుతుండేది .ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మి దేవి,పేరుకు తగ్గట్టే లక్ష్మి దేవి  లాగేఉండేది,ఎంతో సహనం ,అలుపు అంటే తెలియదు భర్తకి ,పిల్లలకి ,ఇంటికి వచ్చిన అతిధులకు  రకరకాల వంటలతో కడుపు నిండా పెట్టటమే ఆమెకు తెలుసు .ముగ్గురు ఆడ పిల్లలు ,ముగ్గురు మగపిల్లలు .వచ్చేపోయే అతిధులతో,నౌకర్లతో,కార్లతో  చాల హడావిడిగా ఉండేది .వాళ్ళు శివ భక్తులు ,చాల పెద్ద పూజ మందిరం ఉండేది .నిత్యం పూజలు చేస్తుండేవారు .పిల్లలందరినీ అపురూపంగా కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచేరు .  క్రమశిక్షణతో ,భయ భక్తులతో ఆరుగురి పిల్లలని పెద్ద చదువులు చదివించేరు,అందరు ఇంజినిరులే స్టేట్ గవెర్నమెంట్ లో మంచి స్థాయిలో ఉన్నారు  .అందరికి మంచి సంబందాలు చూసి చాల గ్రాండ్ గ  జరిపించారు .గ్రాండ్ చిల్డ్రన్ నీ కూడా వాళ్లేపెంచి చదివించేరు.ఆస్తుల పంపకాలు చేసేరు  .అందరు కోటిస్వరులే  మంచిగా స్థిరపడ్డారు.                                                                                                      ఒకరోజు హటాత్ గ  లక్ష్మి దేవిగారు గుండెపోటుతో వెళ్ళిపోయారు .ఈశ్వరావుగారు ఒంటరివారు అయ్యారు .అక్కడివరకే నాకు తెలుసు ,పిల్లలదగ్గరే ఎక్కడో హ్యాపీ  ఉండి ఉంటారనుకున్నకానీ ఇలా అనాదల.............ఈ రోజుల్లో ఈశ్వరరావు గారిలాంటి వాళ్ళు ఎంతమందో ?                                                                                                        తల్లిదండ్రులు పిల్లలని అపురూపంగా పెంచి ,ఖర్చుకి వెనుకాడకుండా చదివించి మంచి ప్రయోజకులని చేసి ,వారు అభివృదిలోకి వచ్చి సంతోషంగా ఉండాలని అనుక్షణం తాపత్ర పడతారు .మరి పిల్లలెందుకు ఇంత స్వార్ధంగా తయారయ్యారు ?                                                                                            ఆ మధ్య  యండమూరి గారి అంతర్ముఖం అనే టీవీ షోలో పట్టాబి గారు మాట్లాడుతూ ,ఓల్డ్ ఎజ్ హోం లో పెట్టడం తప్పులేదు ,వారి వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి కాలక్షేపం గ ఉంటుంది అన్నారు . అల మాట్లాడటం నాకు నచ్చలేదు . తల్లి దండ్రులు కూడా పిల్లల గురించి అలాగే అనుకుంటే ? కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఆనందం ,అనాధల్లాగా   అక్కడ ఉంటె వస్తుందా ?                                     

4 comments:

Saahitya Abhimaani said...

సమాజానికి భయపడి తల్లి తండ్రులను తమ దగ్గర ఉంచుకుని సూటి పోటి మాటలతో వాళ్ళను హింసించేబదులుగా , వృద్ధ ఆశ్రమాల్లో చేరిపించటమే ఉత్తమం.

Anonymous said...

"ఈ అనంత కాల గమనం లో , ఈ రవంత జీవన పయనం లో అందరు నీవారు.. చివరికి మిగిలేదేవరూ లేరు.." అన్న ఓ కవి మాటలు అక్షర సత్యాలు. కాల భ్రమణం లో మనమూ ఓ రోజు ఆ స్టేజి కి వస్తాము అని అందరూ గుర్తెరిగిన నాడు.. ఈ వృద్ధాశ్రమాలు ఉండక పోవచ్చు.. మీ వేదన అర్థం చేసుకోగలను.. కాని ఇదే జీవితం..
రామకృష్ణ

anagha said...

@శివ గారు ధన్యవాదాలు , వృద్దులు అవగానే అందరు వృద్ద ఆశ్రమాలకు వెళ్ళాల్సిన్దేనా ? పరిష్కారం అది కాదనుకుంట . మనము మన తల్లిదండ్రులను ,అత్హమామలను గౌరవించి మంచిగా చూసుకుంటే ,పిల్లలకి కూడా పెద్దవాళ్ళని ఎలా చుసుకోవలో అర్థమవుతుంది ,తల్లి దండ్రులే వాళ్ళకి రోల్ మోడల్స్ . @రామ కృష్ణ గారు ధన్యవాదాలు ,చాల బాగా చెప్పేరు .

anagha said...

@రామ కృష్ణ గారు ధన్యవాదాలు ,చాల బాగా చెప్పేరు .