Saturday, March 19, 2011

పిచ్చుకమ్మలు ఏమయిపోయారు రా !

                   పనమ్మాయి కొంచం ఆలస్యంగా  వస్తే చాలు ,బయట అంట్ల దగ్గర ఆహారం కోసం కాకుల గోల ఎక్కువ ఉంటుంది .వాటిని తరిమిన మల్లి  వస్తానే  ఉంటాయి .అందుకే వాటికోసం గోడ మీదఆహారం  పెట్టి ఉంచుతాను ,అవి తిన్నంత తిని పట్టు కెల్లిపోతాయి. కొన్ని రోజులు పొతే పిచ్చుకల్లగా  ఇవి కుడా అంతరించిపోతయేమో,అన్పిస్తుంటుంది. 
                దాదపు పది సంవత్సరాలనుండి (sparrows ) పిచ్చుకలని చూడటం లేదు,ఏమయిపోయయో ! ఎందుకు అంతరించిపోయాయో తెలియడం లేదు .బహుశా ప్రస్తుత  వాతావరణం కాలుష్యం వలన ఉండాలే క ఎక్కడికైనా వలస వెళ్లి పోయి ఉంటాయేమో ? మన రాష్ట్రము లోనేన ,అన్ని రాష్ట్రాల్లో కూడా కనిపించడం లేదా ?  బుజ్జిగా ,ముద్దుగా , కిచ కిచ లాడుతూ  పిచుకలు కన్పించేవి ,ఇంటిలోకి కూడా వచ్చేవి .                                                                                          నాకయితే పిచ్చుకలంటే చాల ఇష్టం,మా చెల్లి వాళ్ళ అబ్బాయితో 'sparrows చాల ఉండేవి ,ఇంటి ముందు ఏ  పప్పు ఆరబెట్టిన వచ్చి వాలిపోయేవి వాటిని పట్టుకోడానికి ప్రయత్నించేవాళ్ళం,కాని దొరికేవి కాదు' . అని చెపితే అచ్చ్చార్యంగా  వింటాడు ,ఎందుకంటే బుక్స్ లో తప్పితే బయట చూడలేదు .ఈ రోజుల్లో పిల్లలు చూద్దామన్న చూడలేరు . పల్లెల్లో ఇంకా ఎక్కు వ ఉండేవి అక్కడ కూడా మచ్చుకి కూడా ఒక్కటి లేదు  కనుమరుగైపోయాయి .చిన్నప్పుడు నేను మాత్రం వాటిని పట్టుకోవడాని కి చాల ప్రయత్నాలు చేసేదాన్ని .అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంటి బయట వరండ చూరులో  పిచ్చుక గూళ్ళు పెట్టేవి .మగ ,ఆడ పిచ్చుకలు రెండు కష్టపడి పుల్లలు తెచ్చి గూడు  కట్టుకునేవి .ఆడ పిచుక గుడ్లు పెట్టేది ఆహారాని రెండు ఒక్కసారే బయటకు వెళ్ళేవి కావు .ఎలాగు కష్టపడి ఎక్కి వాటిగుడ్లు ఎలా ఉన్నవో చూసేదాన్ని చిన్న గుడ్లు నల్లని మచ్చలతో  ఉండేవి . గుడ్డు లోనుంచి బయటకు వచ్చాక పిల్లలు చూడటానికి అస్సలు బాగుండేవి కావు ,కొంచం పెద్దయ్యాక ముద్దుగా ఉండేవి . అమ్మమ్మ పిచ్చుకలకి  పొద్దున్న సాయంత్రం నూకలు, వడ్లు వేసేవారు ,వడ్లును చక్కగా వలుచుకుని తినేవి . అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వరి కంకుల్ని వాటికోసం  ఇంటి ముందు చెట్టు కి కట్టే వాళ్ళంట, ఒక్కొకటి వలుచుకుని తినేవంట.  వాటిని పట్టుకోవడానికి పిల్లలందరూ ట్రై చేసేవారు కాని దొరికితేన ,ఒక సారి ఫ్యాన్ కి తగిలి పిచ్చుక పడిపోయింది ,దానికి సపర్యలు చేసి నీళ్లు తాగించి పడుకోబెట్టి 'ఇంక ఎగరలేదులే ఇంటిలోనే ఉంచుకోవచ్చు అనుకున్న' తీర పొద్దున్నే లేచేసరికే అది ఎగిరి పోయింది ,చాల బాధపడ్డాను .ఎంతో ముద్దుగా ,జంటగా కనిపించే పిచ్చుకమ్మలని మళ్ళి   చూడగలమ ?                                                                                                                                             

5 comments:

Hima bindu said...

బాగుంది .ముందు తరాలవాళ్ళకి పిచుక ఇలా ఉండేదని వర్ణించాల్సి వస్తుంది .ఈ మధ్యనే హైదరాబాదు లో ఒక అపార్ట్మెంటులో చూసాను దాదాపు అయిదేళ్ళ నుంచి కాపురం ఉంటున్నాయట ..పూర్తిగా అంతరించలేదు అని తెలుస్తుంది .

Unknown said...

I too saw them just 1 week before at our house in hyderabad
My kid(7 months),she enjoyed looking at them,when they are flying from one place to another.

anagha said...

@చిన్నిగారు,
@అద్వైత గారు,
ధన్యవాదాలు . హైదరాబాద్లో కనిపించాయ ! నాకయితే ఎక్కడ కనిపించలేదు .అక్కడక్కడ ఇంకా ఉన్నాయన్నమాట .ఉన్నవాటినన్న కాపాడితే బాగుంటుంది .

ఫణి దీప్ said...

మా ఇంట్లో రెండు పిచ్చుక గూళ్ళు ఉన్నాయండీ :)
కాకులు అంతరించవు ప్రస్తుతానికి ఎందుకంటే అవి వెగంగా వచ్చే మార్పులకి అడాప్ట్ అవుతున్నాయి

anagha said...

thank you . మీ ఊరులో కూడా ఉన్నాయన్నమాట ,ఎక్కువే ఉన్నాయా ?