Sunday, April 24, 2011

ఎందుకో ఈ బాధ ?


      శ్రీ సత్య సాయి బాబా ఇక లేరు అని విన్న దగ్గరనుంచి చాల చాల బాధగా ఉంది ,ఇంత బాధ గ ఎందుకుందో అర్థమవడం లేదు ! ఛానల్స్ అయన గురించి చెపుతుంటే వినడానికి బాధవేసి టీవీ ని ఆఫ్ చేసెను. .                                     ఇంతకి బాబా గురించి, అయన చరిత్ర గాని ,అయన బోధనలు గాని ఎప్పుడు చదవలేదు ,వినలేదు .ఆయన్ని ఎప్పుడు చూడాలని కూడా అన్పించలేదు ,చూడలేదు .                                                                      ఏ సంబంధము లేని నాకే ఇలా ఉంటె ,బాబా భక్తులు,ప్రత్యక్ష సంబంధం ఉన్న అభిమానులకు ఇంకెంత బాధగా ఉంటుందో కదా !

Monday, April 4, 2011

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరాది అందరికి సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆశిస్తు.....

Tuesday, March 29, 2011

బీడీ అప్ప ....బీడీ అప్ప ...

                         నేను వంట పనిలో నిమగ్నమయి ఉన్నాను ....అప్పటిదాకా గోలగోలగా ఉన్న ఇల్లు ఒక్కసారే కర్ఫు విధించినట్టు ఉంది .అంతకు ముందు రోజే హైదరాబాద్ నుంచి పెద్దక్క ,డెల్లి నుంచి తమ్ముడు వచ్చేరు .వాళ్ళు వచ్చేరని
చిన్నక్క ,చెల్లి కూడా వచ్చేరు అందరు కబుర్లు చెప్పుకుంట ఉన్నారు .కిచెన్
 గదిలో ఉన్న నేను , 'అందరు అమ్మ వాళ్ళింటికి వెళ్ళేర ఏంటి' అనుకుంటూ  హాల్లోకి వచ్చెను . అందరు అక్కడే ఉన్నారు ,కానీ చిన్నక్క పడుకుని ఉంది ట్రాన్స్లో ఉన్నట్టు అన్ని విషయాలు చెపుతుంది . ఏంటి విషయం అని  మా చెల్లిని మెల్లిగా అడిగెను .మాచెల్లి కిసకిస నవ్వుకుంటూ గత జన్మ  రహస్యమంట అని గుస గుసగ చెప్పింది .నాకు ఇలాంటివాటి మీద  అంతనమ్మకం ఉండదు ,అందుకే  నాకు నవ్వు  వచ్చి
నవ్వాను , నాతోపాటు మా చెల్లి నవ్వడం మొదలు పెట్టింది .అంతేమా ఇద్దరినీ అక్క సీరియస్ చుసింది 'మీకు నమ్మాకంలేకపోతే వెళ్ళిపొండి మమ్మలిని డిస్టర్బ్ చెయ్యొద్దని'అనే అర్థంతో ,...పెద్దక్క ఆంటే అందరికి  కొంచం గౌరవం తో కూడిన భయం .  అంతే ఇద్దరం బుద్ధిగా కూర్చుని చిన్నక్క గత జన్మ రహస్యం చెపుతుంటే విన్నాము .                                                                చిన్న తమ్ముడు మా దగ్గరకు రాకముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్ పెద్దక్క దగ్గరకు వచ్చాడు ,అప్పుడు పెద్దక్క తమ్ముడుతో'పునర్జన్మల గురించి రిసెర్చ్ చేసిన ఇద్దరు డాక్టర్స్ఉన్నారంట,వాళ్ళుఎవరి  పునర్జన్మ    ఏంటో చెపుతారంట ' మనము వెళ్దామా అందంట.ఇలాంటి సబ్జెక్టు ఆంటే వాడికి మహా ఇష్టం ,దాదాపు ఇద్దరి అభి రుచులు ఒక్కటే .ఇద్దరు కలిసి వెళ్లి వాళ్ళ గత జన్మ గురించి తెలుసు కున్నారు . ఇంతకి తమ్ముడేమో గత జన్మలో కింగ్ అంట ,అక్క బంజారా స్త్రీ అంట . అలాగే  మా అందరి గత జన్మలు తెలుసుకోవాలని వారి ప్రయత్నం .                                                                                                               మా టీవీ లో ప్రతి బుధవారం వచ్చే గత జన్మ రహస్యాలు అనే రియాల్టీ షోని చూస్తున్నాను .ఇంతకి అక్క వాళ్ళు వెళ్ళింది అయన దగ్గరకే నంట.ఆ షో చూస్తుంటే అచ్చర్యంగా,ఆసక్తిగా  అన్పిస్తుంది  .ఒక్కొకసారి  నమ్మలా,వద్ద అన్పిస్తుంది.ఎప్పుడో 13th century లోజన్మ తరువాత మళ్లి ఇప్పుడు పుట్టివుంటే ఈ మధ్యలో చాల జన్మలు ఎత్తి ఉండాలి ,అంటే ఎప్పుడు మనుషులుగానే పుడతామ?ఏ దేశం లో వాళ్ళు ఆ దేశంలోనే పుడతార ? ఆత్మలు మరి దేవుడి దగ్గరకువెళ్ళవ ?మరి దయ్యాల విషయమేంటి ?పునర్జన్ముంటే దయ్యాలు లేనట్టేకద ?ఇలాంటి సందేహాలెన్నో. .                                                                                                                                                                       మా మామయ్య  చెప్పిన సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది .                                                                          మా చిన్నప్పుడు   గుంతకల్లు లో మా పెదనాన్న గారు కాంట్రాక్టర్ లు  చేసేవారు ,ఆయనకు హెల్పగ మా మామయ్యా  వెళ్ళేరు .ఉరవకొండ అనే ఊరులోవర్క్స్ జరిగేవంట అక్కడంతా అడివి ప్రాంతం , ఒక్కొక్క సారి వర్క్ ముగించుకుని వచ్చే సరికి లేట్ అయ్యేదంట. అందరు ఎప్పుడు ఒక్కసారే ఇంటికి వెళ్ళేవారంట .ఒకసారి వర్కర్స్ అందరు వెళ్లి పోయారంట .పని ఉండి మామయ్యా ఆలస్యంగా బయలుదేరేడంటదంత  . అప్పటికి తొమ్మిది గంటలయ్యింది ,చిమ్మ చీకటి ,దారి మధ్యలో వెహికల్ ఆగి పోయిందట ,మబ్బులు కూడా పట్టి వర్షం వచ్చేలాఉందంట( ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు) ఆ దారిలో వెళ్ళేవాళ్ళు కన్పిస్తరేమో అని చూస్తూన్నడంట  .అనుకున్నట్టుగానే ఒకాయన నడుచుకుంటూ వస్తు న్నడంట,మా మామయ్యా కి ప్రాణం లేచి వచ్చిందంట . దగ్గరకు వచ్చిన తరువాత మామయ్యా  ప్రోబ్లం చెప్పి ,ఎక్కడనుంచి వస్తున్నారని మాట కలిపాడంట .అతను ఏమి మాట్లాడకుండా చలిగా ఉంది బీడీ అప్ప అని అడిగాడంట .బీడి లేదన్నడంట ,అయిన మళ్లి బీడీ అప్ప ....బీడీ అప్ప అంటున్నడంట .వీడేదో తేడాగా ఉన్నాడు అని మామయ్యా   స్పీడ్గా నడవటం మొదలెట్టేడంట ,ఆయనకూడా మామయ్యా పక్కనే నడుస్తా  బీడీ అప్ప..బీడీఅప్ప   ..అని అడుగుతూనే ఉన్నడంట .మామయ్యా కి విసుగొచ్చి జేబులోనుంచి సిగరెట్ పెట్టి తీసి అతనికి ఒకటిచ్చి తను  కూడా అగ్గి  పెట్టి వెలిగించాడంట   .పక్కనున్న వ్యక్తి అదృశ్య మయ్యడంట .ఒక్కసారే వళ్ళుజలదరించి స్పీడ్ గా నడుస్తున్నడంట , సిగరెట్ అయిపొయింది .కాసేపటికి మళ్లి బీడీ అప్ప ...బీడీ అప్ప అనివెనకాలే మళ్ళి వచ్చేడంట . వెంటనే ఇంకో సిగరెట్ వెలిగించేడంట ,మళ్లి మాయం .నిప్పు ఉంటె ఆ దెయ్యం ఉండట్లేదని అర్ఘమయ్యి ,ఆ రిపోయినప్పుడల్లా అగ్గిపుల్ల వెలిగించుకుంట ,బ్రతుకు జీవుడా అనుకుంట ఇంటికి చేరేడంట.                                                                                                                                                            ఊరు   నుంచి వచ్చిన మామయ్య జరిగిన సంఘటన అమ్మ కి చెపుతుంటే ,చిన్న పిల్లలమయిన మేమందరమూ విని ,భయం తో  మా అందరికి నెల రోజులు సరిగ్గా నిద్రలు లేవు .                                                                                                                                                              ఇప్పుడు నేను  దేయ్యలన్న   ,పునర్జన్మలన్న  నమ్మను .మనము పుట్టకముందు మనకు ఏమితెలియదు  ,అలాగే తరువాత కూడా ప్రకృతిలోనో ,దేవుడి లోనో ఆత్మ  కలిసిపోతుంది  అనుకుంటాను .అల అయితేనే బాగుంటుంది .                                                                     







                                                                                                                                                                                           

             

Saturday, March 19, 2011

పిచ్చుకమ్మలు ఏమయిపోయారు రా !

                   పనమ్మాయి కొంచం ఆలస్యంగా  వస్తే చాలు ,బయట అంట్ల దగ్గర ఆహారం కోసం కాకుల గోల ఎక్కువ ఉంటుంది .వాటిని తరిమిన మల్లి  వస్తానే  ఉంటాయి .అందుకే వాటికోసం గోడ మీదఆహారం  పెట్టి ఉంచుతాను ,అవి తిన్నంత తిని పట్టు కెల్లిపోతాయి. కొన్ని రోజులు పొతే పిచ్చుకల్లగా  ఇవి కుడా అంతరించిపోతయేమో,అన్పిస్తుంటుంది. 
                దాదపు పది సంవత్సరాలనుండి (sparrows ) పిచ్చుకలని చూడటం లేదు,ఏమయిపోయయో ! ఎందుకు అంతరించిపోయాయో తెలియడం లేదు .బహుశా ప్రస్తుత  వాతావరణం కాలుష్యం వలన ఉండాలే క ఎక్కడికైనా వలస వెళ్లి పోయి ఉంటాయేమో ? మన రాష్ట్రము లోనేన ,అన్ని రాష్ట్రాల్లో కూడా కనిపించడం లేదా ?  బుజ్జిగా ,ముద్దుగా , కిచ కిచ లాడుతూ  పిచుకలు కన్పించేవి ,ఇంటిలోకి కూడా వచ్చేవి .                                                                                          నాకయితే పిచ్చుకలంటే చాల ఇష్టం,మా చెల్లి వాళ్ళ అబ్బాయితో 'sparrows చాల ఉండేవి ,ఇంటి ముందు ఏ  పప్పు ఆరబెట్టిన వచ్చి వాలిపోయేవి వాటిని పట్టుకోడానికి ప్రయత్నించేవాళ్ళం,కాని దొరికేవి కాదు' . అని చెపితే అచ్చ్చార్యంగా  వింటాడు ,ఎందుకంటే బుక్స్ లో తప్పితే బయట చూడలేదు .ఈ రోజుల్లో పిల్లలు చూద్దామన్న చూడలేరు . పల్లెల్లో ఇంకా ఎక్కు వ ఉండేవి అక్కడ కూడా మచ్చుకి కూడా ఒక్కటి లేదు  కనుమరుగైపోయాయి .చిన్నప్పుడు నేను మాత్రం వాటిని పట్టుకోవడాని కి చాల ప్రయత్నాలు చేసేదాన్ని .అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంటి బయట వరండ చూరులో  పిచ్చుక గూళ్ళు పెట్టేవి .మగ ,ఆడ పిచ్చుకలు రెండు కష్టపడి పుల్లలు తెచ్చి గూడు  కట్టుకునేవి .ఆడ పిచుక గుడ్లు పెట్టేది ఆహారాని రెండు ఒక్కసారే బయటకు వెళ్ళేవి కావు .ఎలాగు కష్టపడి ఎక్కి వాటిగుడ్లు ఎలా ఉన్నవో చూసేదాన్ని చిన్న గుడ్లు నల్లని మచ్చలతో  ఉండేవి . గుడ్డు లోనుంచి బయటకు వచ్చాక పిల్లలు చూడటానికి అస్సలు బాగుండేవి కావు ,కొంచం పెద్దయ్యాక ముద్దుగా ఉండేవి . అమ్మమ్మ పిచ్చుకలకి  పొద్దున్న సాయంత్రం నూకలు, వడ్లు వేసేవారు ,వడ్లును చక్కగా వలుచుకుని తినేవి . అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వరి కంకుల్ని వాటికోసం  ఇంటి ముందు చెట్టు కి కట్టే వాళ్ళంట, ఒక్కొకటి వలుచుకుని తినేవంట.  వాటిని పట్టుకోవడానికి పిల్లలందరూ ట్రై చేసేవారు కాని దొరికితేన ,ఒక సారి ఫ్యాన్ కి తగిలి పిచ్చుక పడిపోయింది ,దానికి సపర్యలు చేసి నీళ్లు తాగించి పడుకోబెట్టి 'ఇంక ఎగరలేదులే ఇంటిలోనే ఉంచుకోవచ్చు అనుకున్న' తీర పొద్దున్నే లేచేసరికే అది ఎగిరి పోయింది ,చాల బాధపడ్డాను .ఎంతో ముద్దుగా ,జంటగా కనిపించే పిచ్చుకమ్మలని మళ్ళి   చూడగలమ ?                                                                                                                                             

Sunday, March 13, 2011

అనుకోని అతిధి

               చిన్ననాటి స్కూల్ లో  చదివిన బ్లాగ్ మిత్రులు వచ్చేరు,  అని మా దాదా  ఫోన్ చెయ్యగానే ఆశ్చర్యపోయాను   ! రెండు  రోజుల క్రితమే చెప్పింది ,ఏదో మాటవరసకు అని ఉంటారులే నిజంగా వస్తరంటలే అనుకున్న . అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళెను ,పరిచయ కార్యక్రమలయ్యాయి .అసలే నాకు చిన్ననాటి జ్ఞాపకాలంటే చాల ఇష్టం .మా స్కూల్ లో  చదివిన మిత్రులు  బ్లాగ్ ద్వార పరిచయమయ్యి కలుసుకోవడం చాల చాల హ్యాపీగ  అన్పించింది .ఇంకా మా కబుర్లులన్ని ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళాయి ,మా   పిల్లలు కూడా మాతో పాటే ఎంతో ఆసక్తితో మా చిన్ననాటి కబుర్లు వింటూ కూర్చున్నారు .టైం చాల సరదాగా  గడిచిపోయింది .మిత్రులు కొత్తవ్యక్తిలా అనిపించలేదు .

మానవత్వమ నీ చిరునామా ఎక్కడ?


                        " నీకో బాధకరమయిన విషయం చెప్పనా"అంది పెద్దక్క ఫోన్లోలో .చెప్పు అన్నాను కాస్త భ యపడుతూ."ఏమిలేదు మన ఈశ్వర్ రావు మామయ్య ఓల్డ్ ఎజ్ హోం లో ఉన్నరు ,బర్త్ డేకి ఆర్ఫన్ హోం లో స్వీట్స్ పంచడానికి వెళ్ళితే అక్కడ చూసేను ,చాల బాధవేసింది,  వాళ్ళ పిల్లలమీద చాల కోపంగా ఉంది , ఆయనకీ ఎలా హెల్ప్ చెయ్యల అని ఆలోచిస్తున్నాను అంది " .అది వినగానే  నాకు చాల బాధ వేసింది .ఆరోజంతా మనసు వికలంగ ఉంది ఆయన గుర్తుకు  వస్తూనే ఉన్నారు .                                                                                                                                                      
                                  ఈశ్వర్ రావు అంకుల్ మాకు బందువు ,అంతకంటే ఎక్కువ నాన్న గారి కి స్నేహితులు ,సెంట్రల్ గవర్నమెంట్ లో చాల పెద్ద పోస్ట్ లో ఉండేవారు ,సంపన్న కుటుంబం .ఇల్లు జమిందారుల ఇల్లులాగా,ఇస్వర్యంతో కళకళలాడుతుండేది .ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మి దేవి,పేరుకు తగ్గట్టే లక్ష్మి దేవి  లాగేఉండేది,ఎంతో సహనం ,అలుపు అంటే తెలియదు భర్తకి ,పిల్లలకి ,ఇంటికి వచ్చిన అతిధులకు  రకరకాల వంటలతో కడుపు నిండా పెట్టటమే ఆమెకు తెలుసు .ముగ్గురు ఆడ పిల్లలు ,ముగ్గురు మగపిల్లలు .వచ్చేపోయే అతిధులతో,నౌకర్లతో,కార్లతో  చాల హడావిడిగా ఉండేది .వాళ్ళు శివ భక్తులు ,చాల పెద్ద పూజ మందిరం ఉండేది .నిత్యం పూజలు చేస్తుండేవారు .పిల్లలందరినీ అపురూపంగా కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచేరు .  క్రమశిక్షణతో ,భయ భక్తులతో ఆరుగురి పిల్లలని పెద్ద చదువులు చదివించేరు,అందరు ఇంజినిరులే స్టేట్ గవెర్నమెంట్ లో మంచి స్థాయిలో ఉన్నారు  .అందరికి మంచి సంబందాలు చూసి చాల గ్రాండ్ గ  జరిపించారు .గ్రాండ్ చిల్డ్రన్ నీ కూడా వాళ్లేపెంచి చదివించేరు.ఆస్తుల పంపకాలు చేసేరు  .అందరు కోటిస్వరులే  మంచిగా స్థిరపడ్డారు.                                                                                                      ఒకరోజు హటాత్ గ  లక్ష్మి దేవిగారు గుండెపోటుతో వెళ్ళిపోయారు .ఈశ్వరావుగారు ఒంటరివారు అయ్యారు .అక్కడివరకే నాకు తెలుసు ,పిల్లలదగ్గరే ఎక్కడో హ్యాపీ  ఉండి ఉంటారనుకున్నకానీ ఇలా అనాదల.............ఈ రోజుల్లో ఈశ్వరరావు గారిలాంటి వాళ్ళు ఎంతమందో ?                                                                                                        తల్లిదండ్రులు పిల్లలని అపురూపంగా పెంచి ,ఖర్చుకి వెనుకాడకుండా చదివించి మంచి ప్రయోజకులని చేసి ,వారు అభివృదిలోకి వచ్చి సంతోషంగా ఉండాలని అనుక్షణం తాపత్ర పడతారు .మరి పిల్లలెందుకు ఇంత స్వార్ధంగా తయారయ్యారు ?                                                                                            ఆ మధ్య  యండమూరి గారి అంతర్ముఖం అనే టీవీ షోలో పట్టాబి గారు మాట్లాడుతూ ,ఓల్డ్ ఎజ్ హోం లో పెట్టడం తప్పులేదు ,వారి వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి కాలక్షేపం గ ఉంటుంది అన్నారు . అల మాట్లాడటం నాకు నచ్చలేదు . తల్లి దండ్రులు కూడా పిల్లల గురించి అలాగే అనుకుంటే ? కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఆనందం ,అనాధల్లాగా   అక్కడ ఉంటె వస్తుందా ?                                     

Tuesday, March 1, 2011

మహా శివరాత్రి శుభాకాంక్షలు

                                                              ఓం నమః శివాయః