Friday, January 21, 2011

సంక్రాంతి 2011

                                                 నూతన సంవత్సర మరియు  సంక్రాంతి శుభాకాంక్షలతో
ఈ సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇల్లు కళకళ లాడింది ,కూతుళ్ళు-అల్లుళ్ళు ,కొడుకులు-కోడళ్ళు ,మనవళ్లు-మనవరళ్ళతో, ఎవ్వరు మిస్ కాకుండా అందరు వచ్చేరు .వారం రోజులు క్షణం లాగా గడచిపోయాయి . కొత్త బట్టలు, ఒకరికి ఒకరు గిఫ్ట్ ఇచ్చుకోవడం.పెద్ద పెద్ద పిండి వంటలు, ఈ వయసులో కూడా అమ్మ కూర్చోదు ,బయట కొననీయదు  అన్ని అమ్మ చేసేస్తుంది .అంత ఓపిక ఎక్కడ నుంచి వస్తుందో అన్పిస్తుంది .పిల్లకోసం చేస్తున్నాను అనుకుంటే చాలు ,అమ్మకు ఓపిక వస్తుంది .పిల్లల అల్లరి ,మా కబుర్లతో ఇల్లంతా సందడి.   అమ్మ ,నాన్నల ముఖాల్లో ఆనందం ,వారి సంతోషంగా ఉంటె మా అందరికి ఆనందం.ఈ సంక్రాంతి సిటీలో ఉండే అమ్మ వాళ్ళింటిలో కన్నా అందరం కలిసి, నానమ్మ వాళ్ళ ఊరులో సంక్రాంతి జరుపుకుని ఉంటె ఇంకా బాగుండేది అన్పించింది .
                                   మా చిన్నప్పుడు నాన్నగారు ఉద్యోగ రీత్య ఎంత దూరం లో ఉన్న ,సంక్రాంతికి మాత్రం నానమ్మ వాళ్ళ ఊరు తీసుకువచ్చేవారు .మా అందరికి ఆ ఊరంటే బోలెడంత ఇష్టం .
నానమ్మ వాళ్ళ ఊరు చిన్న గ్రామం ,చుట్టూ పచ్చని పొలాలు .....పొలాల గట్లమీద అన్ని తాడి చెట్లు ,ఈత చెట్లు ఎక్కువగా ఉంటాయి. (వేసవిలో ముంజలకు కొదవే ఉండదు)చెరువు,ఒకేఒక్క గుడి రామాలయం .  .ఊరికివచ్చి రాగానే పిల్లల గ్రూప్  మా కజిన్స్ వచ్చి మా చుట్టూ చేరి ఊరిలో విశేషాలు చెప్పేవారు .పొద్దున్నే ఎక్కడికి  వెళ్ల లో  ప్రోగ్రాం ఫిక్స్ చేసేవారు,పొద్దున్నే ఇదు గంటలకు పొలాల గట్టుల మీద పూచే ముళ్ళ గోరింట పూలు,డిసెంబర్ పూలు  ,బంతి పూలు కోసుకువచ్చే ప్రోగ్రాం   .తెల్లవారు జాము ఇదు గంటలకే లేచేవాళ్ళం ,మంచు తో ఊరు ,పొలాలు ఏమి కన్పించేవి కాదు ,జలుబు చేస్తుందని బయటకి రానిచ్చేవారు కాదు.ఎలాగోలా తప్పి చ్చుకుని    బయటపడేవాళ్ళం ,అప్పటికే పిన్ని వాకిలిని ఉడ్చి పచ్చని పేడ కలాపి వేసేది .నాయనమ్మ పెద్ద పెద్ద గీతాల ముగ్గు పెట్టేది ,గుప్పెడ నిండా ముగ్గుపిండి  తీసుకుని నలుగు వేళ్ళనుండి సన్నటి గీతాలు గిసేది, వాకిలి నిండా చాల పెద్ద ముగ్గు పెట్టేది ,చుస్తాకి  రెండు కళ్ళు చాలేవి కాదు.అల వెయ్యాలని చాల ప్రాక్టీసు చేసేదాన్ని ,కాని ఇప్పటికి అలవేయలేను .నెల పట్టినదగ్గరనుంచి అన్ని రకాల ముగ్గులు వెయ్యవచ్చు,కానీ భోగిరోజుమాత్రం    గడులను క్లోజ్ చేసి  ముగ్గువెయ్యాలని ,సంక్రంతిరోజు   గడులను ఒపెన్చేసిముగ్గు వెయ్యాలని ,కనుమ రోజు రధం ముగ్గు వెయ్యాలని నానమ్మ దగ్గరే తెలుసుకున్నాను .నలుగురం  అక్క చెళ్ళల్లం ,మాకజిన్స్ అంత చలిలో బయటకు వచ్చేవాళ్ళం . పల్లేటురుల్లో భోగి రోజే కాకుండా రోజు చలిమంటలు వేస్తరు,అక్కడ కాసేపు కుర్చునేవాళ్ళం .ఈలోపు మా దాదా అందరితో పిచ్చపాటి కబురులు చేప్పేసేది .దారిపొడవునా అందరు పలకరిస్తుండేవారు ,మేము ఒకనవ్వు నవ్వి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం . దాదని మాత్రం వదిలేవాళ్ళు కాదు బంధువులతో కలుపుగోలుగా ఉండేది ,అభిమానులు కూడా ఎక్కువ .మంచులో పొలాల గట్లమీద పువ్వులు కోసుకుని పనిలోపని పెసర ,మినప కాయలు కోసుకువచ్చేవాళ్ళం .అప్పటికి ఇంకా కాయలు ముదురేవి కాదు అయిన కోసేసేవాళ్ళం .ఇంటికి వచ్చి పూలన్నిటిని మాలలు కట్టి  గుమ్మలకి వేలడదియటం ,బంతిపూలు  ,అరిసెల వాసనలతో ఇల్లంతా గుబాలించేది.డిసెంబర్ పూలు వైలెట్ కలర్   ,ముల్లగోరింత ,పక్క టౌన్ నుంచి కనకాంబరాలు మరువం చిన్నన గారు తీసుకు వచ్చేవారు ,మాలలుకట్టి జడ పొడవున పెట్టుకునేవాళ్ళం .

                               అమ్మ,పిన్ని పిండివంటలు వంటలతో ,నాన్నగారు ,చిన్నన గారు  వచ్చిన బంధువులతో కబుర్లలో ఉండేవారు . అల చెయ్యండి ,ఇళ్ళ చెయ్యండి అని ఆర్డర్ వేస్తూ నాయనమ్మ , మేము  హరిదాసుల్లు, గంగిరెద్దులవారు వస్తే వాళ్ళకి బియ్యం వెయ్యటానికి పోటి పడేవాళ్ళం . గొబ్బెమ్మలు పెట్టి వాటిలో  గుమ్మడి పూలు వాటిని ఎవ్వరు తొక్కకుండా ,ఒక కంట కాపలా. గోరింటాకు కోసుకోచ్చుకుని  పెట్టుకుని  ఎవరిదీ బాగా పండిందో అని పోటి .పండగరోజు పట్టు లంగాలు వేసుకుని ,చక్కగా తయారయ్యి చుట్టలందరి ఇళ్లు చుట్టి వచ్చేవాళ్ళం.పండగ రోజు కాసిం వచ్చేవాడు ,ఇదు ఊరులకు కలిపి ఒకే ఒక్క టైలర్ ,ముందు తీసుకు రాకుండా పండగ రోజు తీసుకు వచ్చినందుకు కోప్పడేవారు ,తరవాత పిండివంటలు పెట్టేవారు .నాన్నగారి చిన్నప్పట్నించి ఆయనే టైలర్  అంట! అమ్మ నాన్నగారిని మమ్మల్నందరినీ అప్యాంగా పలకరించి చాల సేపు కబుర్లు చెప్పి వెళ్ళేవాడు .రాసులు పోసి ఎర్రటి  రేగుపళ్ళ బండి వచ్చేది, సోలడు వడ్డు ఇస్తే సోలడు రేగు పళ్ళు ఇచ్చేవాడు(బార్టర్ సిస్టం ) ,మా అందరికి ఇష్టమని ,మా పిన్ని చాల రేగు పళ్ళు కొనేవారు .అందరి ఇంటి ముందు పురి ,పాత్ర  ఉండేవి( వడ్డు నిల్వ ఉంచడానికి )కానీ ఈ రోజుల్లో ఎక్కడ అవి కన్పించడం లేదు .ఎడ్లు ,ఎడ్ల బళ్ళు ,ఆవులు ,గేదలు అందరి ఇళ్ళలో ఎక్కువుగా ఉండేవి ,ఇప్పుడు అవికూడాతగ్గిపోయాయి . ఒకప్పుడు గ్రామాలూ లక్ష్మి తో కళకళ లాడుతుం డేవి. ఇప్పుడు చుస్తే మనుషులే కరువయ్యారు ,ముసలి తల్లి దండ్రులు మాత్రం ఉంటున్నారు .పిల్లలందరూ వేరే దేశాల్లోను ఉంటున్నారు . 
                                        అందరిళ్ళలో పందెం కోళ్ళు పెంచేవారు, పండగరోజు భోజనాలతరవత కుర్రవాళ్ళు ఎవ్వరు కనిపించేవాళ్ళు కాదు .పక్క ఊరిలో రెండు  కిలోమీటర్ల  దూరం లో కోళ్ళపందేలు ,ఎడ్ల పందేలు జరిగేవి ,అందరు అక్కడికి వెళ్లి పోయేవారు .మాకు వెళ్లలన్పించి మేము వస్తామంటే ,"అమ్మో !పెదనాన్న చుస్తే ఎమన్నా ఉందా?మమ్మల్ని వెళ్లనియ్యరు " అని  చిన్నన గారి అబ్బాయిలిద్దరూ ఎవ్వరికి తెలియకుండా వెళ్ళేవారు .మాకే కాకుండా ,నాన్నగారంటే అందరికి టెర్రర్ . కానీ ఉరు వస్తే అట విడుపు .అల్లరి ,ఆటలు, కబుర్లు సంతోషంగా రోజు లు గడచేవి .
                                    మన సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడుతున్నాయని అందరికి బాధగా ఉంది ,ఈ తరం పిల్లకి అవి తెలియచేయాలని స్కూల్స్లో ,కాలేజి ,ఇంజనీరింగ్ కాలేజి లలో కూడా  చాలచక్కగా   సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు . ఇదు వరకు ముగ్గులపోటిలు మాత్రమే పెట్టేవారు .ఇప్పుడు ఇవన్ని  చూసి పిల్లలు, ' సంక్రాంతి పండుగ అంటే ఇలాజరుపుకుంటారని మాకు ఇప్పుడే తెలిసింది' అని చెపుతున్నారు .శుభా పరిణామమే .