Saturday, December 18, 2010

నా గుండె జారిన రోజు

నాన్న గారి ఉద్యోగ రీత్యా చిత్తూర్లో ఉన్నాము .అది అక్టోబరు .స్కూలు నుండి ఇంటికి వచ్చాను.చాలాఆనందంగా ఉన్నాను.ఎందుకంటే ఆ రోజు నా పుట్టినరోజు .స్కూల్లో అందరికి చాక్లెట్లు పంచేసరికి పిల్లలంతా నా చుట్టూ తిరుగుతూ వి.ఐ.పి లా ట్రీట్ చేసారు .ఆ ఆనందం నుండి తెరుకునేలోపే ఇంటికి వచ్చేసా . ఆ రోజుకి ప్రై వేటు డుమ్మా కొడదామనుకున్నా కాని అమ్మ మాత్రం ప్రై వేటు నుండి వచ్చినాకే గుడి కి వేల్దామంది.అది నాకెంతో ఇష్టమైన గుడి . ఇంటికి దగ్గర లోనే కొండ మీద మురుగన్ స్వామి గుడి ఉండేది . ప్రతి పండగకీ ఇంట్లోవారందరం తప్పకుండా దర్సిస్తాం ఆ

ట్యూషన్ కి వెళ్ళాను అన్నాను.మా అమ్మ ట్యూషన్ టీచర్ కి స్వీట్స్ తీసుకుని వెళ్ళమని అన్నది .స్వీట్స్ ఇచ్చేసి ఆవిడ దగ్గర పెర్మిషన్ తీసుకుని వచ్చేద్దామని వెళ్లాను .మా టీచర్ బర్త్ డే విషెస్ లెక్కల పుస్తకం తీయమంది .ఎగ్జామ్స్ వున్నాయి కాబట్టి తప్పదుఅన్నది.నా ఆనందం అంతా ఒక్కసారే ఎగిరిపోయింది.గుడిని.మేమే కాదు ఆ గుడి మా ఊర్లోనే చాలా ఫేమస్ బలవంతాన బుక్ తీశాను ,దూరంగా కొండ మీద నుంచి మురుగన్ స్వామి గుడినుంచి పాటలు వినిపిస్తున్నాయి .అక్కడ పారిజాతం పూల చెట్టు వుంటుంది ,అక్కడ కుప్పలుగా పూలు రాలి పది వుంటాయి .వాటిని ఏరుకుని ఆడుకోవడం నాకు చాల ఇష్టం .అందుకే ముఖ్యంగా గుడి కి వెళ్ళేదాన్ని .నా ఆలోచనలన్నీ గుడి చుట్టూనే తిరుగుతున్నాయి ...ఎప్పుడేపుడుపుస్తకం మూసి ఇంటికి వెళ్తానా అని...టీచర్ మీద చాల కోపంగా వుంది ,ఎలనైతేనేం ట్యూషన్ అయ్యిందనిపించాను .నేను బయలుదేరబోతుండగా టీచర్గారు నాకో ప్యాకెట్ అందించారు ..నాకు ఆశ్చర్యం అక్కడే గబగబా విప్పి చూసాను ,ఆలివ్ గ్రీన్ గోల్డ్ కలర్ అంచు వున్నా ఇంకు పెన్ను ,పెన్సిల్ ఎరైసేర్ ,స్కేల్ ....నేను గాల్లో తెలిపోయాను ,అప్పటిలో ఐదులోకి వస్తే కాని పెన్ ఇచ్చేవారు కాదు ,నేనేమో నాలుగాయే ,నాకంటూ స్వంత పెన్ రావడం ...అబ్బో ఎంత ఆనందమో ....పదేపదే చూసుకున్నాను ..అప్పటివరకు ఆవిడ మీదున్న కోపం ఎగిరిపోయింది.ముందు అక్కవాళ్ళకి చూపించాలి ,థాంక్స్ కూడా చెప్పలేదు ,ఒకటే పరుగు ...ఇంటికేసి ,ట్యూషన్ నుండి కొంత దూరం నడిచి మలుపు తిరిగాను ,ఒక్కసారి మళ్లిపెన్ చూడాలి అనిపించింది ,అప్పుడే చీకటి అలుముకుంటుంది ,బాగ్ నుండి పెన్ తీసి చూసుకుంటున్నాను ,చేతినుండి పెన్ జర్రున జారి పడింది ,నేను కిందకి చుస్తే నేను నిలబడి వున్నది బండరాళ్ళు పరిచి వున్నా డ్రైనేజి ,రాయికి రాయికి మద్య చిన్న సందు ,ఆ సందులోకి నా పెన్ జారిపోయింది .....పెన్ కాదు నా గుండె జారిపోయింది ,చాలాసేపు తొంగి చూసాను ఎక్కడ జాడలేదు ......కళ్ళ లో నీటితో బరువెక్కిన గుండె తో ఇంటికి బయలుదేరాను ....అటు గుడికి చెడ్డాను ..ఇటు పెన్ను దక్కిన్చుకోలేకపోయాను ,కాని ఇంట్లో వాళ్ళతో మాత్రం పోయిన నా పెన్ గురించి వర్ణించి వర్ణించి చెప్పి తృప్తి పడ్డాను .ఆ రోజు మొదలు నేను ట్యూషన్ కి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ప్రతిరోజు పెన్ పడ్డ చోటు బండల మద్యలోకి చూసి వెళ్ళేదాన్ని ,ఎప్పటికైనా కనిపిస్తుదేమోనని ...

.


2 comments:

Anonymous said...

ఉన్నది కొంత కాలమైనా, మీకు ఆ వూరి మీద, ఆ గుడి మీద అంత మమకారమున్నందుకు చాల ఆశ్చర్యం గాను, ఆనందం గాను ఉందండీ..
రామకృష్ణ

anagha said...

@రామకృష్ణ గారు
నా భాల్యం అంతా మధురంగా గడిచిందండీ అందులో చిత్తూరు ఒక మధుర స్మృతిమా ఇల్లు మా అక్కలు చెల్లితమ్ముళ్ళు తో గడిపిన క్షణాలు అన్నీ తీపి గుర్తులే .